📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పేద ప్రజల అభివృద్దే టిడిపి లక్ష్యం:రవీంద్రారెడ్డి 

పేద ప్రజల అభివృద్దే టిడిపి లక్ష్యం:రవీంద్రారెడ్డి 

📰 Generate e-Paper Clip

పేద ప్రజల అభివృద్దే టిడిపి లక్ష్యం:పేద ప్రజల అభివృద్దే టిడిపి లక్ష్యం:ప్రజావాణి (న్యూస్ మర్చి 29) కాశినాయన మండలం బాలయపల్లె,గంగనపల్లె, ఉప్పులూరు గ్రామాలలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా రంగంలో ఎంతో బిజీగా ఉన్న నందమూరి తారక రామారావు నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టిడిపిని స్థాపించారన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా ఎనలేని కీర్తి సాధించారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టిడిపికి దక్కిందన్నారు. ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా నిలిచారన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండలాలు, మొదలైన ఏర్పాట్లు చేసిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం నూతన వరవడులు సృష్టిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ను స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో *బాలయ పల్లె గ్రామ టిడిపి నాయకులు* కృష్ణారెడ్డి,నాగసుబ్బారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఓబయ్య, *గంగనపల్లె టిడిపి నాయకులు* రామసుబ్బారెడ్డి, ఎం. సుబ్బయ్య, పీరవలి,అల్లా ప్రకాష్, గుర్రప్పుడు,కొండారెడ్డి రోసిరెడ్డి, *ఉప్పులూరు టిడిపి నాయకులు* పోలిరెడ్డి, రమణారెడ్డి, కొండారెడ్డి, లింగారెడ్డి, శ్రీను, రోశయ్య తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.