📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పండుగపూట విషాదం: చెరువులో పడి ఆవు మృతి* శోకసముద్రంలో రైతు...

పండుగపూట విషాదం: చెరువులో పడి ఆవు మృతి* శోకసముద్రంలో రైతు కుటుంబం.

📰 Generate e-Paper Clip

*పండుగపూట విషాదం: చెరువులో పడి ఆవు మృతి*

 

శోకసముద్రంలో రైతు కుటుంబం.

 

మరణించిన ఆవు విలువ సుమారు రూ. 60,000 వేలకు పైగా ఉంటుందని, తెలిపిన రైతు కుటుంబం.

 

 

ప్రభుత్వం తమనీ ఆదుకోవాలంటూ రోదిస్తున్న రైతు కుటుంబం.

 

 

చెన్నారావుపేట మార్చి 19 (ప్రజావాణి)

 

 

ఉగాది పర్వదినాన రైతు కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు చేదోడువాదోడుగా ఉంటూ, తమలో ఒకరిగా కలిసిపోయిన ఆవు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లా, చెన్నరావుపేట మండలం ఖాదర్‌పేట (గొల్లపల్లి) గ్రామంలో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు బట్టమేకల రవి తండ్రి మల్లేష్, తమ పెంపుడు ఆవును నీటి కోసం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లారు. అయితే, ఆవు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మృతి చెందింది.కుటుంబ సభ్యులకు ఎంతో ఆత్మీయమైన ఆవు అకస్మాత్తుగా మరణించడంతో, ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.ఆదుకోవాలని వేడుకోలు మరణించిన ఆవు విలువ సుమారు రూ. 60,000 పైగా ఉంటుందని, తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది తమకు తీరని నష్టమని రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో తమకు అండగా ఉండే ఆవును కోల్పోవడం పండుగ పూట వారిని మరింత కృంగదీసింది. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తమను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని రవి, ఇతర కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.