📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గ్రామాల స్వయం సమృద్ధి కి కృషి చేయాలి.. అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకo

గ్రామాల స్వయం సమృద్ధి కి కృషి చేయాలి.. అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకo

📰 Generate e-Paper Clip

 

గ్రామాల స్వయం సమృద్ధి కి కృషి చేయాలి..

 

అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకo

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై అవగాహన పెంచుకోవాలి.

ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.

విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి..

ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించాలి..

కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

 

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని సర్పంచులకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హాజరై.. 99 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రసంగించారు.. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు, ఆదాయ- వ్యయాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేలా నాణ్యమైన విద్య వైద్యం అందించడంతోపాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

పన్నుల వసూలుతో పాటు సొంతంగా ఆదాయం పెంచుకోవాలని సర్పంచులకు సూచించారు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ సమావేశాలు గ్రామసభలు నిర్వహిస్తూ.. నిత్యం వార్డులను పర్యవేక్షిస్తూ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలని సూచించారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం అందరం కలిసి కట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచులు వార్డు సభ్యుల సహకారంతోనే పేదలకు సక్రమంగా అందుతాయని పేర్కొన్నారు. గ్రామానికి సర్పంచి సుప్రీమ్ అని ఉద్ఘాటించారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలను ప్రగతి పథంలో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పుట్టిన ప్రాంతానికి సేవ చేసే భాగ్యం లభించడం అదృష్టమని ఆ విధంగా భావిస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసి పది తరాలకు గుర్తుండిపోయేలా సర్పంచులు పనిచేయాలన్నారు. గ్రామ సర్పంచులు అన్నీ తామై వ్యవహరిస్తూ ప్రజలకు భరోసా నింపాలన్నారు.

 

*ప్రజలకు మరింత చేరువ కావాలి*

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..

ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుందన్నారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో సగానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. తెల్ల రేషన్ కార్డుల జారీ చేపట్టామన్నారు.

సర్పంచులు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

99 రోజుల కార్యాచరణలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక బృహత్తర కార్యక్రమమని దీన్ని సర్పంచులు అంత చక్కగా వినియోగించుకోవాలని సూచించారు.

 

*గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలి*

భారతావానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకొని 99 రోజుల కార్యాచరణలో భాగస్వాములు కావాలన్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

*సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ*

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఇది సదా అవకాశమని.. నూతన సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

గ్రామాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు , ఉన్నత స్థానాల్లో నిలిచిన వారి సహకారం తీసుకొని గ్రామపంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అందరి సహకారంతో గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు.

 

ఈ సందర్భంగా *పలువురు అధికారులు* మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూస్తూ.. అన్ని శాఖల అధికారుల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సర్పంచులకు పురుష సాయిలు అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డిపిఓ జగదీశ్వర్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, డిఆర్డిఓ శ్రీధర్, డీఏవో భాగ్యలక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.