📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipet(ఈవిఎం) గోదాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన..

(ఈవిఎం) గోదాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట జిల్లా, మార్చి 10, ప్రజావాణి

కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. త్రైమాసిక పరిశీలీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవిఎం గోదాం ను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్ లను భద్రపరిచిన ద్వారాలను వాటికున్న సీల్ లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు ప్రకారం అన్ని భద్రత చర్యలు తీసుకుంటున్నామని, గోదాం లోపల, బయట, చుట్టు పరివారం మొత్తం ప్రతిదీ సిసి కెమెరాలో నిక్షిప్తం అవుతాయని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్ తెలిపారు. విజిటర్ రిజిస్టర్ లో సంతకం చేశారు. అనంతరం గోదాం అందరి సమక్షంలో ముఖ ద్వారానికి తాళం వేసి సీల్ వేసారు. ఈ పూర్తి ప్రక్రియ వీడియో గ్రపీ తీశారు.కలెక్టర్ వెంట డిటి బాలరాజు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.