📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అకాల వర్షాలతో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించిన కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు...

అకాల వర్షాలతో దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించిన కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చ్20)బద్వేలు,పోరుమామిళ్ల,కాశినాయన,కలసపాడు మండలాల్లో విస్తృతంగా పండ్ల తోటలు సాగు చేయబడుతున్నాయి.ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అరటి పంట ప్రధానంగా సాగు అవుతోంది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు,ఈదురు గాలుల కారణంగా రైతులకు చేతికి వచ్చిన అరటి పంట తీవ్రంగా దెబ్బతిన్నది.ఈ నేపథ్యంలో కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు కాశినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి. బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.అలాగే ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు..ఇటుకలపాడు సహా సమీప గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగినట్లు స్థానికులు తెలియజేయగా, ఆ విషయాన్ని ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ గమనించారు. ఈ మూడు మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతుందని, ఇది రైతుల ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపారు.ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని దాని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని వెంకటసుబ్బారెడ్డి,మురుగు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి,వెంకట సుబ్బారెడ్డి, గజ్జల గోపిరెడ్డి,బూసి రామ సుబ్బారెడ్డి,నాగిరెడ్డి,అంకాల రెడ్డి, శ్రీనివాసులు నందమూరి శ్రీనివాసులు,వెంకటేశ్వర్లు,సూర్య నారాయణ రెడ్డి, దుర్గారావు,విజయ భాస్కర్ రెడ్డి,బాలయ్య రామకృష్ణయ్య,రామకృష్ణయ్య, అడవి రాముడు కృష్ణ, కృష్ణ,వెంకటేష్,నాగ సుబ్బారెడ్డి,రాము,మంత్రి రెడ్డి తదితరులు.అలాగే బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్,అరవ శ్రీనివాసులురెడ్డి,చెండ్రాయుడు,చిన్న వెంకట సుబ్బయ్య,బాదిరెడ్డి వీరా రెడ్డి,ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య,అశోక్ కుమార్ రాజు,ప్రహ్లాద్ రెడ్డి,పామూరి బాలి రెడ్డి,కల్లూరి దుగ్గిరెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి,సిమెంట్ వెంకట సుబ్బారెడ్డి,బిజీవేముల చంద్ర శేఖర్ రెడ్డి,గురుప్రసాద్ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి, బ్రహ్మదండ,శ్రీనివాసులు,కోటపాటి పెంచలయ్య, అందూరు వెంకట సుబ్బా రెడ్డి,పురుగూటి నాగ సుబ్బారెడ్డి,మంత్రి రెడ్డి సుబ్బారెడ్డి,సుబ్బారెడ్డి ఇటుకలపాడు రామచంద్రయ్య,నల్లమల్ల చంద్రశేఖర్ రెడ్డి,వడమాను శ్రీనివాసులు రెడ్డి,వడ్డమను శ్రీనివాసులురెడ్డి,శ్రీరాములు,జక్కుల పవన్,తదితర తెలుగుదేశం పార్టీ సావిశెట్టిపల్లి, ఇటుకుల పాడు, ఆకుల నారాయణపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.