📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalరైస్ మిల్లులో రాయల్ దందా... అన్నపూర్ణ రైస్ మిల్లులో రంగురంగుల...

రైస్ మిల్లులో రాయల్ దందా… అన్నపూర్ణ రైస్ మిల్లులో రంగురంగుల బియ్యం…. అధికారులతో మాట్లాడుకున్నాం మాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు అంటూ అత్యుత్సాహం…

📰 Generate e-Paper Clip

రైస్ మిల్లులో రాయల్ దందా…

 

అన్నపూర్ణ రైస్ మిల్లులో రంగురంగుల బియ్యం….

 

అధికారులతో మాట్లాడుకున్నాం మాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు అంటూ అత్యుత్సాహం…

 

కుడా పర్మిషన్ తీసుకోకుండానే ఆరు నెలల క్రితమే గోదాం నిర్మాణం పూర్తి చేసి గణుడు…

 

రైస్ మిల్ గోడౌన్ కు అసెస్మెంట్ నెంబర్ లేకుండానే వ్యాపారం దండిగా సాగింపు.

 

ముక్కి మురిగిన బియ్యన్ని సామాన్య ప్రజలకు పాలిష్ కొట్టి అంట గడుతున్న అన్నపూర్ణ ఇండస్ట్రీస్…

 

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం….

హన్మకొండ/ ప్రజావాణి:హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి అన్నపూర్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఆవరణంలో సామాన్యులకు కడుపునింపేలా సన్నబియ్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకున్న పతకానికి చెదలు పట్టిస్తు కొత్త దందాకు తెరలేపారు.తడిసి ముక్కిన, కుళ్ళిన వడ్లను చీకటి మార్గంలో కొనుగోలు చేసి ప్రజలకు అంటగడుతున్నారు అని పలు ఆరోపణలు లేకపోలేదు.తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందాలని ప్రతిష్టాత్మకంగా చేపడితే ప్రజలకు లేని రోగాలను అంటగట్టే విధంగా రైస్ మిల్ యాజమాన్యం సిద్ధమవుతున్నట్టు వాపోతున్న స్థానికులు. ఇదిలా ఉంటే రైస్ మిల్ ఆవరణంలో చేపట్టిన కట్టడానికి అనుమతులు లేకుండా లక్షల బస్థాలను నిల్వచేసే స్టోరేజ్ రూమును నిర్మించి ఎటువంటి అనుమతులు లేకుండా అధికారులతో కాలయాపన చేస్తున్న అన్నపూర్ణ ఇండస్ట్రీస్ యాజమాన్యం.ఇప్పటి వరకు రైస్ మిల్లుకు కనీసం అస్సేస్మెంట్ నెంబర్ ఉండకపోవడంతో దీని వెనక ఉండి నడిపిస్తున్న అధికారులు ఎవరు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లై అధికారులు మాత్రం

 

ఏప్పటికప్పుడు మిల్లర్లకు సూచనలు చేస్తూ వడ్లను పంపిస్తున్న యాజమాన్యం మాత్రం వాటిని పక్కదారి పట్టిస్తూ రాత్రికి రాత్రులే దొంగ మార్గాన రేషన్ బియ్యాన్ని,తడిసిన వడ్లను డంపు చేసుకుని పాలిష్ కొట్టి తిరిగి ప్రభుత్వానికి అప్పచెబుతున్నా మిల్లు స్థాపకులు.ఇంత జరుగుతున్న సివిల్ సప్లై అధికారులకు సమాచారం చేరవేసిన కానీ అటు మోహన చుసిన నాధులు లేరు. దీనిని అదునుగా చూసుకొని ఏదైతేనేం అధికారులతో మేం చూసుకుంటాం, ఎలాగైనా మేం చేసుకుంటాం అడగడానికి మీరెవరు అని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్న అన్నపూర్ణ ఇండస్ట్రీస్ నిర్వాహకులు.గతంలో పలు రైస్ మిల్లులపై ఎన్ని ఆరోపనలు వచ్చిన, ఆఖరికి కేసులు అయినా కూడా తిరిగి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు మళ్ళీ వారికీ జిల్లా అధికారులు ప్రభుత్వం వడ్లను కేటాయించడంతో ఉన్నత అధికారులు మిల్లు యాజమాన్యం కలిసి పనిచేస్తున్నారా లేక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యాన్ని సామాన్యులకు అందేలా చర్యలు చేపడుతారా అని గట్టిగానే చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించేనా సామాన్యులకు సన్నబియ్యం న్యాయంగా అదేట్టు చేస్తారా లేక మిల్లుర్ల ముసుగులోనే మునిగిపోతారా చూడాలి..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.