📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరులో “ఫారెస్ట్ భూముల చౌక బేరం” కలకలం సోములవారిపల్లెలో అటవీ భూములపై అక్రమ విక్రయాల...

ప్రొద్దుటూరులో “ఫారెస్ట్ భూముల చౌక బేరం” కలకలం సోములవారిపల్లెలో అటవీ భూములపై అక్రమ విక్రయాల ఆరోపణలు – చర్యల కోసం ప్రజల డిమాండ్

📰 Generate e-Paper Clip

ప్రొద్దుటూరులో “ఫారెస్ట్ భూముల చౌక బేరం” కలకలం

సోములవారిపల్లెలో అటవీ భూములపై అక్రమ విక్రయాల ఆరోపణలు – చర్యల కోసం ప్రజల డిమాండ్

ప్రొద్దుటూరు, కడప జిల్లా:

“సెంటు ఒక లక్ష మాత్రమే… రండి బాబు రండి…” అంటూ అటవీ భూములు అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రొద్దుటూరు పరిధిలోని సోములవారిపల్లె పంచాయతీ ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన భూములు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

148 ఎకరాల ఫారెస్ట్ భూమి వివాదం

స్థానికుల సమాచారం ప్రకారం, 542/1 సర్వే నెంబరులో సుమారు 148 ఎకరాల అటవీ భూమి ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతం పెన్నా నది సమీపంలో ఉండటంతో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత కలిగినది. గతంలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసించిన ఈ భూమిని, ప్రస్తుతం కొంతమంది అధికారులు సెంటుకు లక్ష రూపాయల చొప్పున అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చట్ట విరుద్ధమా…? అధికారుల మౌనమేంటి?

అటవీ భూముల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, పచ్చదనం పెంపు బాధ్యత అటవీ శాఖదే. అయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలు, ఫారెస్ట్ ల్యాండ్‌లో ఫామ్ హౌస్‌లు, విలాసవంతమైన రిసార్ట్లు నిర్మాణం జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “మామూలు తీసుకుని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

దేవాలయంపై ఆగ్రహం

స్థానికులు మరో ఆరోపణ చేస్తూ, “మా వారాహి అమ్మవారి గుడిని కూల్చివేస్తారా? కానీ అదే ప్రాంతంలో పెద్ద పెద్ద నిర్మాణాలను అనుమతిస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధార్మిక భావాలను దెబ్బతీసే చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రాజకీయ స్పందన కోరుతూ…

ప్రజలు రాష్ట్ర డిప్యూటీ సీఎం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నారు. “అటవీ భూములపై జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలి. బాధ్యులపై సస్పెన్షన్ లేదా కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

పోరాటం ఆగదు…

“ఈ ఫారెస్ట్ అధికారి పై చర్యలు తీసుకునేంతవరకు మా పోరాటం ఆగదు” అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రొద్దుటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

(గమనిక: ఈ ఆరోపణలపై సంబంధిత అటవీ శాఖ అధికారుల స్పందన కోసం ప్రయత్నించగా సమాధానం లభించలేదు. అధికారిక ధృవీకరణ కోసం విచారణ అవసరం.)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.