📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamపందిళ్ళపల్లి వ్యవహారంలో వెలుగు చూసిన పంచాయతీ కార్యదర్శులు ఆక్రమాలు..? సుమోటో...

పందిళ్ళపల్లి వ్యవహారంలో వెలుగు చూసిన పంచాయతీ కార్యదర్శులు ఆక్రమాలు..? సుమోటో కేసులో ఇన్చార్జి డిపి ఓ విచారణ పూర్తి..?

📰 Generate e-Paper Clip

పందిళ్ళపల్లి వ్యవహారంలో వెలుగు చూసిన పంచాయతీ కార్యదర్శులు ఆక్రమాలు..?

 

సుమోటో కేసులో ఇన్చార్జి డిపి ఓ విచారణ పూర్తి..?

 

ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధంగా.. పంచాయతీ అధికారుల అవినీతి వాస్తవమే..!

 

నేటి పంచాయతీ కార్యదర్శి పై కమ్ముకుంటున్న అవినీతి ఆరోపణలు..?

 

జిల్లా కలెక్టర్ చెంతకు చేరిన ఇన్చార్జి డిపిఓ నివేదిక.. బాధితులకు అందిన దస్త్రం

 

 

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 210 నందు బాధిత కుటుంబం కొనుగోలు చేసిన ఓ ప్లాటు ఇల్లు వ్యవహారంలో ఎట్టకేలకు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సంచలన సమగ్ర కథనాలు అందించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు పై విచారణ క్షుణ్ణంగా చేసినట్లు అదేవిధంగా దీంట్లో కొన్ని వివరాలు పొందు పరుచ లేదనిబాధితు కుటుంబం ఆరోపిస్తోంది. ప్రధానంగా ఎటువంటి లింకు డాక్యుమెంట్లు ముటేషన్లు లేకుండా పంచాయతీ రికార్డులలో 2010 2011 2012లో నమోదు చేసిన ఆ నాగేంద్రుడు అవినీతి అక్రమాలకు అడ్డుపద్దు లేకుండా కొనసాగినట్లు గ్రామస్తులు బాధితులు ఆరోపిస్తున్నారు. సదరు పంచాయతీ కార్యదర్శి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా పలు క్రమబద్ధీకరణలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. కాగా సదురు పంచాయతీ కార్యదర్శి పందిళ్ళపల్లి గ్రామంలోని పంచాయతీ కార్యదర్శిగా విధులు కొనసాగిస్తున్న వేళ. సదరు పంచాయతీ కార్యదర్శి పందిళ్ళపల్లిలో తిష్ట వేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అవినీతికి పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు తెలుస్తోంది

కాగా అవినీతి అక్రమాలకు పాల్పడిన సదరు పంచాయతీ అధికారులతో పాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా తప్పుడు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రూపుదిద్దుకున్నట్లు ఆ మేరకు గత సంవత్సరం సెప్టెంబర్ 11 2025లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సదరు సబ్ రిజిస్టర్ పంచాయతీ రికార్డులను ప్రామాణికంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేశామని బాధితులకు అందించిన సమాచారం మన ప్రజావాణి కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇదే వ్యవహారంపై జిల్లా రాష్ట్ర స్థాయిలో బాధితులు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ స్పందించి సుమోటోగా స్వీకరించి ఇన్చార్జి డిపిఓ రాంబాబు రెండు ద పాలుగా విచారణ చేశారు. ఆ నివేదిక సారాంశాన్ని స్థానిక సంస్థల కలెక్టర్ కు పంపించినట్లు బాధితులకు సమాచారం అందింది. ఆనాటి పంచాయతీ అధికారులు నేటి పంచాయతీ కార్యదర్శి నిర్వాకంతో బాధిత కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతలు పలు దపాలుగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా బాధితు కుటుంబానికి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అవినీతి అక్రమాలకు పాల్పడిన పంచాయితీ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని తుంగలో తొక్కి రికార్డులలో నమోదు అయిన వివరాలను రద్దు చేయాలని బాధితు కుటుంబం హక్కుల సంఘాల నేతలు కోరుతున్నారు. కాగా సదరు పంచాయతీ అధికారి రికార్డులలో నమోదు వాస్తవమే అని ధ్రువీకరించి ఇందిరమ్మ బిల్లు ఎలా చెల్లిస్తారు అంటూ ఆ వివరాలు జిల్లా కలెక్టర్కు అందించిన నివేదికలో పొందుపరచకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.