EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్

ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్

📰 Generate e-Paper Clip

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

జిల్లా డిఎస్పి రఘు చందర్

ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఫిబ్రవరి 08(ప్రజావాణి):

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ లో నిర్వహిస్తున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ధర్మపురి మున్సిపాలిటీలో ఈ నెల 11 న జరిగే ఎన్నికలలో ఎలాంటి అవంచనీయా మైన సంఘటనలు జరగకుండా, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలందరూ సహకరించాలనే  ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలపాటి రాం నర్సింహారెడ్డి ల ఆధ్వర్యంలో ధర్మపురి సర్కిల్ పోలీస్ సిబ్బంది తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ… ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఎలాంటి  గొడవలకు తావు ఇవ్వకుండా, ప్రజలకు అభ్యర్థులకు తెలియజేశారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్సైలు జి మహేష్, రవీందర్, వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్, బుగ్గారం ఎస్సై సతీష్, గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.