📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్చౌడేపల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం

చౌడేపల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం చంద్రన్న చిత్రపటానికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి చౌడేపల్లి, ఫిబ్రవరి 28: చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ బత్తలాపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) పాల్గొన్నారు.పెన్షన్ పంపిణీ సందర్భంగా గ్రామ నాయకులు, లబ్ధిదారులు కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకటో తేదీ ప్రభుత్వ సెలవు దృష్ట్యా పెన్షన్లు ఒక రోజు ముందుగానే అందజేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సిబ్బంది ఉదయమే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి పరిపాలనను మునుపెన్నడూ చూడలేదని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. చంద్రన్న ఆధ్వర్యంలో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని తెలిపారు.కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.