📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఅంగరంగ వైభవంగా శ్రీ అంబటి మల్లన్న పట్నాలు

అంగరంగ వైభవంగా శ్రీ అంబటి మల్లన్న పట్నాలు

📰 Generate e-Paper Clip

అంగరంగ వైభవంగా శ్రీ అంబటి మల్లన్న పట్నాలు

స్వామివారి దీవెనలకై విచ్చేసిన మద్దుల గోపాల్ రెడ్డి

జాతర ఆవరణలో సర్పంచ్ శారద మల్లేష్ గౌడ్ అన్నదాన నిర్వహణ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ ఎండపల్లి ఫిబ్రవరి 12 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ అంబటి మల్లన్న పట్నాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ఈ ఆలయంలో మల్లన్న స్వామి పట్నాలు, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారని, అలాగే ప్రతి ఏటా ఆలయ ఆవరణలో గ్రామంలోని ప్రతి ఇంటి నుండి స్వామివారికి బోనాలు సమర్పించుకుంటారని స్థానికులు తెలియజేశారు. ఈ మల్లన్న స్వామి పట్నాల మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, పలువురు సర్పంచులు స్వామి వారి ఆశీస్సులపై అలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బాలసాని శారద మల్లేశం గౌడ్ వారికి ఘన స్వాగతం పలికారు, వారు స్వామివారి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ ఒగ్గు పూజారి గోపాల్ రెడ్డికి పసుపు బండారి అందించి స్వామి వారి దీవెనలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. అంబటి మల్లన్న స్వామి పట్నాల మహోత్సవానికి విచ్చేయడం సంతోషంగా ఉందని, ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సర్పంచ్ సమక్షంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను ఆయన కొనియాడారు, ఆ స్వామివారి చల్లని దీవెనలు గ్రామంలోని ప్రతి ఒక్కరిపై కలగాలని కోరుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ బాలసాని శారద మల్లేశం గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వాతావరణమంతా పసుపు బండారితో, ఒగ్గు పూజారుల డమరుక నాదాలతో, స్వామివారికి అందజేసే బోనాలతో అంగరంగ వైభవంగా జాతర కొనసాగుతుంది. నాయకులు గోపాల్ రెడ్డి వెంట సర్పంచులు, సంగ రమేష్ యాదవ్, జి రెడ్డి మహేందర్ రెడ్డి, బెడ్డల ప్రవీణ్, కొడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.