
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) పోరుమామిళ్ల పట్టణంలోని హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన యూకేజీ విద్యార్థుల స్నాతకోత్సవం చిన్నారుల విద్యా ప్రస్తావన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచి ఉత్తమమైన వేడుకగా సాగింది.చిరునవ్వు చిన్నారుల ఉత్సాహంతో అంకితభావంతో కూడిన ఉపాధ్యాయినీలు గర్వపడే విధంగా తల్లిదండ్రులు మరియు ఉల్లాసంగా ఉన్న విద్యార్థులు ఈ సందర్భానికి సాక్ష్యంగా నిలవడంతో ఈ వేడుకను ఆనందదాయకంగా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెవరెండ్ ఫాదర్ ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించడం,అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్తమ పాఠశాలలో ఒకటైన హోలీ రోజున రోసరి పాఠశాల విద్యాపరంగా,సామాజికంగా మరియు భావద్వేగ పరంగా అభివృద్ధి చెందే తమ పాఠశాల మంచి వాతావరణాన్ని ఇస్తుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రాథమిక విద్య కీలక పాత్ర పోషిస్తుందని మరియు యూకేజీ పూర్తి కావడమే కాకుండా ఒక ఉత్తేజ కరమైన కొత్త అభ్యాసన సాహసానికి నాంది పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



