➡️ జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి చేతుల మీదుగా అందచేత
➡️ హోమ్ గార్డుల ఐకమత్యాన్ని అభినందించిన జిల్లా ఎస్.పి గారు
కడప ఏప్రిల్ 24: మానవత్వం, ఐకమత్యం కేవలం మాటల్లోనే కాదని జిల్లాలోని హోమ్ గార్డులు నిరూపించారు. తమతో కలిసి విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మహిళా హోమ్ గార్డుకు అండగా నిలబడి అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏ.ఆర్ విభాగంలో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల జి.లక్ష్మీదేవి( డబ్ల్యు. హెచ్.జి 475) పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా ఆమెకు తమ వంతు సాయం అందించేందుకు జిల్లాలోని హోమ్ గార్డులందరూ ముందుకు వచ్చారు. స్వచ్చందంగా ఒకరోజు వేతనాన్ని వితరణగా ఇచ్చి పోగు చేసి రూ. 4,06,120 సేకరించారు.
ఈ ఆర్ధిక సాయాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి చేతుల మీదుగా రూ.4,06,120 చెక్కును జి.లక్ష్మీదేవికి అందచేశారు. ఈ సందర్బంగా హోమ్ గార్డుల ఐకమత్యాన్ని, వారి గొప్ప మనసును జిల్లా ఎస్.పి గారు ప్రత్యేకంగా అభినందించారు. పదవీ విరమణ పొందిన హోమ్ గార్డు జి.లక్ష్మీదేవి కుటుంబ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ శ్రీశైల రెడ్డి పాల్గొన్నారు.
#kadapasp
#kadapapolice
#APPolice
#Dial112



