హోమ్ గార్డుల ఆదర్శం…పదవీ విరమణ పొందిన మహిళా హోమ్ గార్డుకు రూ. 4,06,120 ఆర్ధిక సాయం*
➡️ జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి చేతుల మీదుగా అందచేత ➡️ హోమ్ గార్డుల ఐకమత్యాన్ని అభినందించిన జిల్లా ఎస్.పి గారు కడప ఏప్రిల్ 24: మానవత్వం, ఐకమత్యం కేవలం మాటల్లోనే కాదని జిల్లాలోని హోమ్ గార్డులు నిరూపించారు. తమతో కలిసి విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మహిళా హోమ్ గార్డుకు అండగా నిలబడి అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏ.ఆర్ విభాగంలో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ...