📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetహెచ్ పి వి, టీకా -మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచం..

హెచ్ పి వి, టీకా -మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచం..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో హెచ్. పి. వి, టీకా కార్యక్రమాన్నిప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లాలో ఉన్న 10147 మంది 14 సంవత్సరాల బాలికలందరూ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకొనే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కలిగించి ప్రతి ఒక్క బాలిక తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని దీని ద్వారా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారించవచ్చని ఈ టీకా ఒక డోస్ తీసుకుంటే సరిపోతుందని ప్రజలు ఎలాంటి అపోహలకు గురికా వద్దని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ , డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్ బాబ్జి ,ప్రోగ్రామ్ ఆఫీసర్ సి హెచ్ ఐ డాక్టర్ దీప్తి ప్రియాంక ,ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ సదానందం, డాక్టర్ శ్రావణి , డాక్టర్ సురేష్ బాబు, జనరల్ ఆసుపత్రి వైద్యుల నాసరుపురా పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ ,ఎన్సిడి కోఆర్డినేటర్స్ రాజేందర్ వెంకటరమణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular