మంగళగిరి ప్రజావాణి న్యూస్ తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి” డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయొద్దు నగరపాలక సంస్థకు ప్రజలు సహకరించాలి: కమిషనర్ అలీం బాషా స్వచ్చ్ ఆంధ్రా డే” సందర్భంగా థీమ్‌తో ర్యాలీ మరియు స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహణ.గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్చ ఆంధ్రా డే కార్యక్రమంలో భాగంగా,మే–2026 నెలకు అనే ప్రత్యేక థీమ్‌ను ప్రకటించిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉదయం మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్ర నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ మరియు స్వచ్ఛ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి అదనపు కమిషనర్ శ్రీమతి శకుంతల అద్యక్షత వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు,సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ,ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలి అని తెలిపారు.అలాగే ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువలు డ్రైన్లు మరియు ప్రజా ప్రదేశాలలో వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైన్లలో చేరడం వల్ల వర్షాకాలంలో నీటి నిల్వలు,డ్రైనేజీ సమస్యలు మరియు పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.నగర పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో ప్రజలు నగరపాలక సంస్థకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ,పరిశుభ్రమైన నగర నిర్మాణానికి కృషి చేస్తామని స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు.ప్లాస్టిక్ వల్ల జీవరాశులకు,నీటి వనరులకు మరియు పర్యావరణ సమతుల్యతకు కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ప్రజలు జ్యూట్ బ్యాగ్ లు మరియు పునర్వినియోగ పదార్థాలను వినియోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు,మెడికల్ హెల్త్ ఆఫీసర్ మల్లికా,సెక్రటరీ శ్రీనివాసరావు,స్వచాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి,గుంటూరు టిడిపి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్,టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు,టిడిపి పట్టణ అద్యక్షులు షేక్ రియాజ్,గోవాడ దుర్గారావు,నగర పాలక సంస్థ సిబ్బంది ,మెప్మా సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
స్వచ్చ ఆంధ్రా డే” సందర్భంగా మంగళగిరితాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అవగాహన ర్యాలీ
RELATED ARTICLES

