📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliసుందిల్ల గ్రామంలో ఉచిత మెగా పశువైద్య శిభిరం

సుందిల్ల గ్రామంలో ఉచిత మెగా పశువైద్య శిభిరం

📰 Generate e-Paper Clip

సుందిల్ల గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం

రామగిరి,మనసమగ్ర ప్రజావాణి,ఫిబ్రవరి 04

మంథని నియోజక వర్గంలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో పశువైద్య విశ్వ విద్యాలయం,పశు వైద్య కళాశాల హైదరాబాద్, పెద్దపల్లి జిల్లా పశు వైద్య, పశు సంవర్డక శాఖ,గోపాల మిత్ర ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉపసర్పంచ్ జనగామ సదానందం, ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు ఈగ శ్రీజ ప్రశాంత్,సదాశివ చారి, స్టాలీన్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ తాటి సమ్మయ్య గౌడ్,గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పశువుల కృత్రిమ గర్భధారణ, చూలు నిర్ధారణ,ఎదుకురాని పశువుల చికిత్స,పశు గ్రాసలపై అవగాహన,నట్టల నివారణ గోపాల మిత్ర క్యాంపు ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు ఉచిత మందులను పంపిణీ చేయడంతో పాటు రైతులు ప్రజలు కనీస అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారులు జి రమేష్, బి కళ్యాణి,రమేష్ ,నిహార్, రేవంత్,లు పశువులకు చికిత్స నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది.గోపాల మిత్ర మార్క శ్రీనివాస్ సుందిల్ల, మల్లికార్జున్,కుమార్,విజయ్ పాల్గొన్నారు.అనంతరం గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు మెంబర్లు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైద్యాధికారులకు శాలువాలతో సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular