సీసీ కెమెరాలతోనే నేరాలకు చెక్
జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ జైపూర్ ,జూలై22,ప్రజావాణి: నేరాల నియంత్రణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో సర్పంచులతో నిర్వహించిన సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దొంగతనాలు, ప్రమాదాల దర్యాప్తులో సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా నిలుస్తోందని, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో వీటి ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు...