📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetసిద్దిపేట పట్టణంలో పలు వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పర్యటించారు..

సిద్దిపేట పట్టణంలో పలు వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పర్యటించారు..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్, ఏప్రిల్ 19, ప్రజావాణి

సిద్దిపేట పట్టణంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ వెను కప్రాంతంలో గల షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ గదులు అన్నీ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయా, భోజనం వసతి ఎలా ఉంది అని ఆరా తీశారు. హాస్టల్ లో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బాధపడవద్దని బాగా చదువుకోవాలని ఎలాంటి సదుపాయాలగైనా ప్రభుత్వం తరఫునుండి అన్ని అందిస్తామని తెలిపారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈనెల 20 నుండి 26 వరకు నిర్వహించబోయే వెల్ఫేర్ వీక్ ను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికల భద్రత అతి ముఖ్యమని కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని రుచికరమైన భోజనం, వసతి కల్పించాలని వార్డెన్ కితెలిపారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ – ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ బాలుర హాస్టల్ కాంప్లెక్స్ సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని బిసి వెల్ఫేర్ బాలుర వసతి గృహలను ఆకస్మికంగా సందర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular