షూటింగ్ ను తలపిస్తున్న చంద్రబాబు పర్యటన – కాకాణి

నెల్లూరు జిల్లా, జూలై 02 ప్రజావాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి  జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌స్తున్నాడంటే సంక్షేమ,అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.కానీ దానికి భిన్నంగా సీఎం చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న సాగింది.రెండేళ్ల చంద్ర‌బాబు పాల‌న చూస్తే ప‌నుల క‌న్నా ప‌బ్లిసిటీలు,ఈవెంట్‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం క‌న్నా కెమెరాల ముందు న‌ట‌న‌లే ఎక్కువైపోయాయి.ప్ర‌తినెలా ఒక‌టో తేదీ పింఛ‌న్ల పంపిణీ పేరుతో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని రావ‌డం,ఆ గ్రామంలో సెలెక్ట్ చేసుకున్న కుటుంబాన్ని క‌లిసి...