📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శాంతమ్మ గారి జ్ఞాపకార్థం నిర్మించిన నూతన షెడ్డు ప్రారంభం

శాంతమ్మ గారి జ్ఞాపకార్థం నిర్మించిన నూతన షెడ్డు ప్రారంభం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి22)చందర్లపాడు మండలం కోనాయపాలెం సిఎస్ఐ చర్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం  కోనాయపాలెం గ్రామంలో ఆదివారం నాడు నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మార్కపూడి వరకుమార్ ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చి నందు వారి తల్లి మార్కపూడి శాంతమ్మ జ్ఞాపకార్థం,నాగమల్లేశ్వరరావు శాంతమ్మ సౌజన్యంతో నిర్మించిన నూతన షెడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక,సామాజిక కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు.శాంతమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ నూతన షెడ్డు చర్చి కార్యకలాపాలకు,విశ్వాసుల సౌకర్యాలకు ఉపయోగపడటం ఆనందకరమని పేర్కొన్నారు.సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆమె కొనియాడారు.మార్కపూడి కుటుంబ సభ్యులు తమ తల్లి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం గ్రామ ప్రజలకు,చర్చి విశ్వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,సిఎస్ఐ చర్చి పాస్టర్ విజయ భాస్కర్,చర్చి కౌన్సిల్ మెంబర్లు,సంఘస్తులు,యువకులు,గ్రామస్తులు
పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular