📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వైయస్సార్సీపి నాయకులకు బీసీలు అంటే చిన్న చూపుని మరోసారి రుజువైంది..

వైయస్సార్సీపి నాయకులకు బీసీలు అంటే చిన్న చూపుని మరోసారి రుజువైంది..

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్11)విజయవాడ పశ్చిమ నియోజకవర్గం  సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా.తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ తో పాటు పలు బీసీ సంఘాల వారు పూలే గారి జయంతి సందర్భంగా వారికార్యాలయాల్లోనూ ఊరివాడల కాంస్య విగ్రహాలందు ఘనంగా నివాళులు అర్పిస్తుంటే.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ భవానిపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహంతో పాటు మహాత్మ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మాజీ దేవాదాయ శాఖ అప్పటి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు 43వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాపతి కోటి రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ చేసి ఉన్నారు.ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా శుభ్రపరిచి ఒక పూలదండను కూడా వెయ్యని విషయాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు దుప్పల శివాజీ ముదిరాజ్ గుర్తించగా.విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని గారి టీం సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నాయకులు నమ్మి భాను ప్రకాష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు 43వ డివిజన్ అధ్యక్షులు మోరబోయిన రాంబాబు, నియోజవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తమ్మిన శేఖర్, యువత అధ్యక్షులు రాళ్లపూడి మాధవ, బిసి యువ నాయకులు ఐటిడిపి చైతన్య,నియోజవర్గం మహిళా నాయకురాలు ముర్రి అపర్ణ, నియోజవర్గం యువత నాయకులు మైలపల్లి అప్పన్న తదితరులు విగ్రహాన్ని శుభ్రపరిచి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం అయినది.ఈ సందర్భంగా సీనియర్ బీసీ నాయకులు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి వారి మంత్రులకు ఎమ్మెల్యేలకు బీసీలు అంటే చిన్న చూపు కాబట్టే వారి ప్రభుత్వ కాలంలో ఎంతోమంది బీసీల మీద దాడులు హత్యలే కాకుండా తెనాలి అమృతలూరు లో పదవ తరగతి చదువుతున్న బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ తన సోదరిని ఏడిపిస్తున్నటువంటి యువకుడిని అడిగినందుకు అంత దారుణంగా హత్యకు గురైన జగన్మోహన్ రెడ్డి స్పందించలేదన్నారు
అలాగే ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  తన హయాంలో ఎడాపెడా పలు విగ్రహాలు ఏర్పాటు చేసి శిలాఫలకాల మీద తన పేరుకు చూపించిన శ్రద్ధ వారికి నివాళులు అర్పించడంలో లేదని విమర్శించారు.నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ మాట్లాడుతూ.
జగన్మోహన్ రెడ్డి మాటకు ఒకసారి ముందు నా బీసీలు అని మాట్లాడుతాడు తప్ప చేతల్లో లేదని తన ప్రభుత్వ కాలంలో బీసీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇవ్వకపోగా బిసి కార్పొరేషన్ చైర్మన్ లను వేసి వారికి విధులు నిధులే కాకుండా కూర్చోవడానికి కుర్చీ కూడా వెయ్యని ఘనత వైసిపి పార్టీదని దువ్య పడుతూ ఈరోజు వారు ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఇలా వదిలేయడం చాలా బాధాకరమని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular