📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వాహనం నడిపే సమయంలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఏర్పాటు చేసిన కుంభాకార దర్పణాలను గమనించి జాగ్రత్తగా...

వాహనం నడిపే సమయంలో బ్లాక్ స్పాట్స్ వద్ద ఏర్పాటు చేసిన కుంభాకార దర్పణాలను గమనించి జాగ్రత్తగా ప్రయాణిద్దాం… ప్రమాదాలను నివారిద్దాం: జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) మార్కాపురం జిల్లాలలో వాహన చోదకుల భద్రత ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుశాఖల బాధ్యత.వాహన చోదకుల సహకారమే ప్రమాదాల నివారణకు మూలం.ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా పని చేద్దాం… రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తుకు పునాదులు వేయుదాం.బ్లాక్ స్పాట్స్ మరియు ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేసి, “ఇక యాక్సిడెంట్స్ మాయం” అనే నినాదంతో ముందుకు వెళ్ళుతున్న ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసుశాఖ.ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యతనిస్తూ, బ్లాక్ స్పాట్ లు మరియు ఆక్సిడెంట్ జరగటానికి అవకాశము ఉన్న ప్రదేశాలలో 115 ప్రదేశాలను గుర్తించడం జరిగిందని, ఆ ప్రదేశాలలో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేయడం ద్వారా ముందస్తు హెచ్చరికలు అందేలా చర్యలు చేపట్టినట్లు ప్రకాశం,మార్కాపురం జిల్లా ఎస్పీ గారు తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనదారులు బ్లాక్ స్పాట్స్ వద్ద మరింత అప్రమత్తంగా ఉండి, కుంభాకార దర్పణాల సహాయంతో ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలని సూచించారు.అలా గుర్తించడం ద్వారా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని వాహన చోదకులకు జిల్లా ఎస్పీ గారు మనవి చేయడమైనది. సైన్‌బోర్డులపై ఉన్న హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు.చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీసి కుటుంబాలకు అపార నష్టం కలిగిస్తుందని, ప్రతి వాహనదారు బాధ్యతతో వ్యవహరించడం అత్యంత అవసరమని ఎస్పీ గారు అన్నారు.బ్లాక్ స్పాట్స్ వద్ద కుంభాకార దర్పణాలను గమనించడం ద్వారా డ్రైవర్లు తక్షణమే అప్రమత్తమై ప్రమాదాలను నివారించగలరని తెలిపారు.ఒక్క ప్రాణం కూడా వాహనం నడుపుతున్న సమయంలో పోగొడదనే దృఢ సంకల్పంతో పోలీసుశాఖ వారు యాక్సిడెంట్స్ నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది.ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ఈ రోడ్డు భద్రత చర్యల్లో ప్రతి వాహనదారు భాగస్వామిగా మారి, ప్రమాదాల నివారణకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.వాహనదారులు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular