📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaవల్బపూర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డివైడర్ ఏర్పాటుపై అధికారుల సానుకూల స్పందన

వల్బపూర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డివైడర్ ఏర్పాటుపై అధికారుల సానుకూల స్పందన

📰 Generate e-Paper Clip


ఉపసర్పంచ్ అంబాల అనిల్

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్బపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఎన్ హెచ్ 563 ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద రహదారి సమస్య పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ తెలిపారు.
ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద డివైడర్‌ను తొలగించి, ఇరు వైపులా ఉన్న సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలు సురక్షితంగా మెయిన్ రోడ్డుపైకి చేరేలా రహదారి ఏర్పాటుకు అదికారుల దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత అధికారులు కూడా అనుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పనులను సుమారు 15 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రత, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పనులు త్వరగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular