బెజ్జంకి -కోహెడ, మే 15 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన మామిడి మహేందర్ గౌడ్‌కు చెందిన సుమారు 400 గడ్డి కట్టలు, బోయిని అశోక్‌కు చెందిన వరి ధాన్యం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.స్థానికుల వివరాల ప్రకారం, పొలంలో ఎండు గడ్డి కాల్చే సమయంలో మంటలు అదుపు తప్పి సమీప ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. దీంతో గడ్డి కట్టలు, ధాన్యం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడంతో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.

