ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు ఎంఆర్వో చంద్రశేఖర్ విజ్ఞప్తి
ఘట్‌కేసర్, జూన్ 27: ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఎడులాబాద్, కొర్రెముల, ప్రతాప్ సింగారం, కాచవాని సింగారం, ముత్వలీగూడ గ్రామాలకు చెందిన కొన్ని భూములు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో ఉన్నాయని మండల తహసీల్దార్ (ఎంఆర్వో) చంద్రశేఖర్ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ఆసక్తి ఉన్న భూ యజమానులు, రైతులు తమ సమ్మతిని మండల రెవెన్యూ కార్యాలయం (ఎంఆర్వో కార్యాలయం)లో తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే గ్రామ ప్రజల సౌకర్యార్థం ఆయా గ్రామాల వార్డు కార్యాలయాలు (పాత గ్రామపంచాయతీ కార్యాలయాలు)లో కూడా వివరాల నమోదు, అభిప్రాయాల స్వీకరణకు ఏర్పాట్లు...