📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశ బాలికలకు ఉచిత ఆరోగ్య  విద్యా అవగాహన శిబిరం

రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశ బాలికలకు ఉచిత ఆరోగ్య  విద్యా అవగాహన శిబిరం

📰 Generate e-Paper Clip

రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో కౌమార దశ బాలికలకు ఉచిత ఆరోగ్య & విద్యా అవగాహన శిబిరం.


ఇరాల, జూన్ 5 : చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని  గ్రామీణ ప్రాంత కౌమార దశ బాలికల ఆరోగ్య పరిరక్షణ, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహార అవగాహన, బాలికల భద్రత మరియు విద్యా సాధికారత లక్ష్యంగా రీడ్స్  సంస్థ ఆధ్వర్యంలో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వేలూరు, చిత్తూరు క్యాంపస్ వైద్య బృందం సహకారంతో సెయింట్ స్టీఫెన్స్ పబ్లిక్ స్కూల్, ఇరాలలో ఉచిత ఆరోగ్య మరియు అవగాహన శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 70 మంది కౌమార దశ బాలికలు పాల్గొని ప్రయోజనం పొందారు. వీరిలో ఆరు గ్రామాలకు చెందిన తార, బాలికలు కూడా పాల్గొన్నారు. రీడ్స్ సిబ్బంది, వాలంటీర్లు మరియు పాఠశాల ప్రతినిధులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సీఎం సి వైద్య బృందం బాలికలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత పరిశుభ్రత, రుతుక్రమ నిర్వహణ, పోషకాహారం, రక్తహీనత నివారణ, శారీరక మరియు మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించింది. విద్యార్థినులు అడిగిన ఆరోగ్య సంబంధిత సందేహాలకు సమాధానాలు ఇచ్చి, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. అలాగే రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విద్యా సామగ్రిని అందించారు. అనంతరం వైద్యం అవసరమైన12 మంది కిషోరి బాలికలను సిఎంసి ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఐ జయశ్రీ బాలికలను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, బాలికలు మరియు మహిళల భద్రత, విద్య యొక్క ప్రాముఖ్యత, ఆన్‌లైన్ భద్రత, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం మరియు సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి బాలిక తన హక్కులను తెలుసుకుని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా “రెడ్ డాట్ క్యాంపెయిన్” నిర్వహించి, రుతుక్రమం పట్ల ఉన్న అపోహలను తొలగించడం, గౌరవప్రదమైన మరియు సురక్షితమైన రుతుక్రమ నిర్వహణను ప్రోత్సహించడం, అలాగే శానిటరీ వ్యర్థాల సరైన నిర్వహణపై అవగాహన కల్పించారు. అదనంగా, బాలికల భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కెరీర్ గైడెన్స్ సెషన్ నిర్వహించారు. ఉన్నత విద్య, వృత్తి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మరియు నాయకత్వ లక్షణాలపై విద్యార్థినులకు మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా రీడ్స్  డైరెక్టర్ థియో స్టీఫెన్స్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత బాలికల ఆరోగ్యం, విద్య, భద్రత మరియు నాయకత్వ వికాసం కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు బాలికల సాధికారత కోసం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంసి  వైద్య బృందం, రీడ్స్ సిబ్బంది, వాలంటీర్లు,తార బాలికలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత బాలికల సమగ్ర అభివృద్ధికి ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాల్గొన్నవారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular