📄 ePaper
Friday, July 17, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapet*రాష్ట్ర పెరిక సంఘం కార్పొరేషన్ చైర్మన్ కు పూర్వ విద్యార్థుల ఘన సన్మానం

*రాష్ట్ర పెరిక సంఘం కార్పొరేషన్ చైర్మన్ కు పూర్వ విద్యార్థుల ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*చిలుకూరు మే30 (ప్రజావాణి*):రాష్ట్ర పెరిక సంఘం కార్పొరేషన్ అధ్యక్షులుగా జెడ్పిహెచ్ఎస్ చిలుకూరు పూర్వ విద్యార్థి దొంగరి వెంకటేశ్వరరావు ఎంపికైన సందర్భంగా పూర్వ విద్యార్థులు, చిలుకూరు ప్రముఖులు వారిని ఘనంగా సన్మానించారు జడ్పిహెచ్ఎస్ చిలుకూరు పాఠశాల ఆవరణలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొని వక్తలు వారి వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని వారి నడవడికని కొనియాడుతూ రాజకీయాల్లో మరింత అభివృద్ధికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అల్సకాని వెంకటయ్య , గౌరవ అతిధులుగా సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ప్రధాన వక్తలుగా విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ పొట్టపాక అంజయ్య ,డాక్టర్ గంగాధర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రంజాన్ బి, విశ్రాంత జడ్పిహెచ్ఎస్ చిలుకూరు పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు అంకతి అప్పయ్య, నరసింహారెడ్డి, కన్నం సాహెబ్ ,కైలాసం వెంకటేశ్వర్లు, గరిణే శేషగిరి, కొండా వెంకయ్య ఇంకా అనేక మంది పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular