రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేసిన బాలాజీ దేవాలయం..
-భద్రాచలానికి దుబ్బాక నుండి కదిలిన గోటి తలంబ్రాలు..
సిద్దిపేట జిల్లా, మార్చి 22, ప్రజావాణి
భద్రాచల రామయ్య కళ్యానానికి దుబ్బాక బాలాజీ దేవాలయం నుండి కదిలిన గోటి తలంబ్రాలు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు,ఈ సంవత్సరం 3క్వింటాల్ల గోటి తలంబ్రాలు అందించాలన్న సంకల్ప దీక్షతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామనామ స్మరణ చేయించి గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నాడు దుబ్బాక వివిధ గ్రామాల నుండి వచ్చిన గోటి తలంబ్రాలకు ప్రత్యేక పూజలు జరిపి బాలాజీ దేవాలయం ప్రతినిధులు రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు, మాట్లాడుతూ. భక్తితో ప్రతి భక్తుడు కూడా మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా మేము ఓలిచిన తలంబ్రాలు రామయ్య కళ్యాణనికి చేరడం ఎన్నో జన్మల పుణ్యమో అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అచ్చి లక్షి నర్సింహా ఆచార్య, చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, చింత నాగేందర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



