📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగుండారం గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

గుండారం గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

గుండారం గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి


బెజ్జంకి, మార్చి 28 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య, బూత్ అధ్యక్షులు ఎలుక శ్రీశైలం గ్రామ ప్రజలతో కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామ ప్రజల తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామ ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల కష్టాల్లో తాను అండగా ఉంటానని తెలిపారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య, బూత్ అధ్యక్షులు ఎలుక శ్రీశైలం (7వ వార్డు సభ్యులు), బీజేపీ నాయకులు కందిరాజు, కోరుకొప్పుల యాదయ్య, నల్లూరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular