📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaరాజన్న సిరిసిల్ల జిల్లాలో మట్టి తవ్వకాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మట్టి తవ్వకాలు

📰 Generate e-Paper Clip

తాడూర్ గ్రామంలో ఓవర్‌లోడ్ టిప్పర్ల దౌర్జన్యం… సీసీ రోడ్లకు ముప్పు…?

••కలెక్టర్ అనుమతులతో చెరువు మట్టి తవ్వకాలు.

••నిబంధనలు పక్కనబెట్టి బాడీ పైకి మట్టి నింపుతున్న టిప్పర్లు.

••గ్రామ సీసీ రోడ్లు దెబ్బతింటాయంటూ ప్రజల ఆందోళన.

••అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు

రాజన్న సిరిసిల్ల జిల్లా /ప్రజావాణి



తంగళ్లపెల్లి మండలం తాడూర్ గ్రామ ఊర చేరువు లో కలెక్టర్ అనుమతులతో చెరువులో నుంచి మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే మట్టి తరలింపులో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల నుంచి వినిపిస్తున్నాయి. టిప్పర్లలో అనుమతికి మించి మట్టిని బాడీ పైకి నింపి గ్రామ వీధుల మీదుగా తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ఇప్పటికే సీసీ రోడ్లు ఉండగా, భారీ టిప్పర్లు పదేపదే ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగించడం వల్ల రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల అంచులు బీటలు వారుతున్నాయని, భవిష్యత్తులో పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. ముఖ్యంగా తడి మట్టితో నిండిన టిప్పర్లు అధిక బరువుతో వెళ్లడం వల్ల సీసీ రోడ్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామ వీధులు ఇలాంటి భారీ వాహనాల రాకపోకలకు అనుకూలంగా లేకపోయినా ఎలాంటి నియంత్రణ లేకుండా టిప్పర్లు సంచరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదంతా అధికారులకు తెలిసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఓవర్‌లోడ్ టిప్పర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ సీసీ రోడ్లను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular