బెజ్జంకి,కోహెడ, జూలై 1(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి వెళ్లే రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై ముగ్గు వేయడంతో వాహనదారులు, గ్రామ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రహదారిపై ముగ్గు వేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, గ్రామస్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి, రోడ్డుపై ముగ్గు వేసిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే, ఆ ప్రాంతంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




