📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamరబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం

రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం

📰 Generate e-Paper Clip

రబీ ధాన్యం కొనుగోలుకు పక్కా కార్యాచరణ సిద్ధం

ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


రబీ (యాసంగి) సీజన్ 2025-26 నందు ఖమ్మం జిల్లాలో 2 లక్షల 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.

అదనపు కలెక్టర్, బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రబీ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ* రబీ సీజన్ 2025-26 లో ఖమ్మం జిల్లా పరిధిలో 2 లక్షల 37 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉంటుందని, రైస్ మిల్లర్లు కనీసం లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

రైస్ మిల్లర్ల నుంచి గన్ని సంచుల సేకరణ సమయంలో చెక్ చేసి నాణ్యత అంశం సర్టిఫై చేసిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ అన్నారు. మిల్ పాయింట్ వద్దే గన్ని సంచుల నాణ్యత పరిశీలన ఉంటుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.  ధాన్యం రవాణా సంబంధించి పెండింగ్ బకాయిల బిల్లు సమర్పించడం జరిగిందని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, జిల్లా రైస్ మిల్ సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular