📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణSuryapetరంజాన్ పండుగ సందర్భంగా గ్రామ ముస్లింలకు సేమియా పంపిణీ.

రంజాన్ పండుగ సందర్భంగా గ్రామ ముస్లింలకు సేమియా పంపిణీ.

📰 Generate e-Paper Clip

*చిలుకూరు మార్చి 20(ప్రజావాణి)*: చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం సేమియా (శీర్ ఖుర్మా)ను పంపిణీ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. నెల రోజులు ఉపవాస దీక్ష అనంతరం వచ్చే ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మసీదు వద్ద ప్రత్యేకంగా సేమియాను తయారు చేసి పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మత భేదాలు లేకుండా అందరికీ సేమియా పంచడం ద్వారా సమాజంలో ఐక్యత స్నేహభావం పెంపొందుతుంది. మిత్రులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ జరుపుకుంటున్నారు రంజాన్ పండుగ సందర్భంగా జరుగుతున్న ఈ సేమియా పంపిణీ కార్యక్రమం ఆత్మీయత మత సామరస్యానికి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని ఈ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నిలపాలని ఆ అల్లాహ్ ను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular