📄 ePaper
Tuesday, July 14, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriయువకుడి మృతికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి

యువకుడి మృతికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడ గ్రామం ఆర్‌జీకే కాలనీలో నివాసం ఉంటున్న గుర్రపు సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ఆర్‌జీకే గ్రామ కాంగ్రెస్ కమిటీ ద్వారా తెలుసుకున్న టీం రేవంత్ అన్న రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని యువకుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు.

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దహన సంస్కారాల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మృతుడి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular