📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మెగా లోక్ అదాలత్ లో 450 కేసులు పరిష్కారం

మెగా లోక్ అదాలత్ లో 450 కేసులు పరిష్కారం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి14)చింతలపూడి జరిగిన మెగా లోక్ అదాలత్ లో 450 కేసులు పరిష్కారం చేయబడ్డాయి అని జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధు బాబు తెలిపారు. ఈ సందర్బంగా వారు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం నాడు కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులు పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని సూచించారు.మెగా లోక్ అదాలత్ లో క్రిమినల్ సివిల్ బ్యాంక్ రికవరీ చెక్ బౌన్స్ బిఎస్ఎన్ఎల్ రికవరీ కుటుంబ తగాదాలు మనోవర్తి ప్రామిసరీ నోట్ కేసులు పరిష్కారం చేయబడ్డాయి అని తెలిపారు.చింతలపూడి ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ కు సంబంధించిన కేసులలో, రికవరీ మొత్తం 81.440/-ఇతర కేసుల రికవరీ కలిపి మొత్తం 50.36.496/-రూపాయలు అపరాధ రుసుమును చలానా ద్వారా గవర్నమెంట్ వారికి చెల్లించి , అన్ని కేసులను కాంపౌండ్ చేయబడినాట్లు తెలిపారు.అదే విధంగా రాజీ చేసుకునే వారు ప్రతి రోజు ఫ్రీ లోక్ అదాలత్ సెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు కేసులు రాజీ చేసుకోవడం ద్వారా విలువైన సమయము డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే మాణిక్యాలరావు అడ్వకేట్ బి నాగేశ్వరరావు పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular