📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మహిళల భద్రత .మనందరి బాధ్యత .మైదుకూరు డిఎస్పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్

మహిళల భద్రత .మనందరి బాధ్యత .మైదుకూరు డిఎస్పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) కడప జిల్లా.మహిళల భద్రత.మనందరి బాధ్యత .మైదుకూరు డిఎస్పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్,రియు మైదుకూరు రూరల్ సీఐ జె. శివ శంకర్ మహిళల భద్రత పై దువ్వూరు మండలం లో అవగాహన సదస్సు మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ మరియు భద్రతా చర్యలపై దువ్వూరు లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపియస్ ఆదేశాల మేరకు మహిళల పై నేరాల నివారణ కు,మహిళలకు విస్తృత అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ పోలీసు లో భాగంగా మీ రక్షణ – మా బాధ్యత పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మరియు ఐ.సి.డి.ఎస్,ఇతర అధికారులు పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మైదుకూరు డిఎస్పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్,మాట్లాడుతూ.మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో భయం వీడి పోలీసులను సంప్రదించాలని కోరారు.వేధింపులు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.సామాజికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.మైదుకూరు రూరల్ సి.ఐ జె.శివ శంకర్ట్ సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ మరియు ఇతర భద్రతా చర్యలపై మహిళలకు అవగాహన కల్పించారు.ఆపదలో ఉన్నప్పుడు డయల్ 112 లేదా డయల్ 100 లేదా శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎస్సై జె. ధనుంజయుడు,ఐ.సి.డి.ఎస్ సి.డీ.పీ.మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular