జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన బుర్ర శ్రీధర్ (28) అనే యువకుడు ఈ శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని గొల్లపల్లి ఎస్ఐ ఎం కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. బాధితుని తల్లి భాగ్యమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయ కలిగిన శ్రీధర్, బ్లాక్ టీ-షర్ట్ ధరించాడు. ఆచూకీ తెలిస్తే గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.
మల్లన్నపేటలో యువకుడు మిస్సింగ్, కేసు నమోదు
RELATED ARTICLES




