భూపతిపేట చెక్‌పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం లారీ నిర్లక్ష్యానికి ఇద్దరికీ తీవ్ర గాయాలు!
మహబూబాబాద్ (గూడూరు) జూలై 26,ప్రజావాణి.
గూడూరు మండలం భూపతిపేట చెక్‌పోస్ట్ వద్ద లారీ, టూవీలర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న గంగారం మండలం కామారం గ్రామానికి చెందిన బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
*లారీల అతివేగమే శాపమా?*
భూపతిపేట చెక్‌పోస్ట్ మరియు గూడూరు పరిసర ప్రాంతాల్లో లారీల అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెక్‌పోస్ట్ వద్ద సరైన స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణమని తెలుస్తోంది.
*బాధితులకు న్యాయం జరగాలి.*
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే మెరుగైన ఉచిత వైద్యం అందించాలని కామారం గ్రామస్థులు, బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భూపతిపేట చెక్‌పోస్ట్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని గూడూరు మండల అధికారులు మరియు పోలీసులను కోరుతున్నారు.






