📄 ePaper
Wednesday, July 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 175 మంది అనాథ, అర్ధానాథ విద్యార్థులకు విద్యా సహాయం

మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 175 మంది అనాథ, అర్ధానాథ విద్యార్థులకు విద్యా సహాయం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 06 ప్రజావాణి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో చదువుతున్న 175 మంది తల్లిదండ్రులు లేని మరియు తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.1,000 నగదుతో పాటు రూ.1,000 విలువైన విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి అధ్యక్షత వహించగా,ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చిత్తా కుటుంబం ఆధ్వర్యంలో మదర్ థెరెసా ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు.రూ.5కే మధ్యాహ్న భోజన పథకం,ఉచిత వైద్య సేవలు మరియు డాక్టర్ల కన్సల్టేషన్,అనాథాశ్రమం,మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ,వడ్డీ లేని రుణాలు,వృద్ధాశ్రమం వంటి అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. నేడు మండలంలోని 175 మంది విద్యార్థులకు విద్యా సహాయం అందించడం అభినందనీయమని అన్నారు.మదర్ థెరెసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ,తాము అందిస్తున్న సహాయం చిన్నదైనా,తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరికీ “మీరు ఒంటరివారు కారు,సమాజం మీతో ఉంది” అనే భరోసా కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో అసమానతలు తొలగుతాయని నమ్మి విద్యా, వైద్య రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఓఎల్ఎఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆరోగ్య రాణి మాట్లాడుతూ,ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం,బ్రయాన్ గిల్‌క్రిస్ట్,చిత్తా శౌరి రెడ్డితో పాటు పోరుమామిళ్ల ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసి మరణించిన మహనీయులను స్మరించుకుంటూ ఒక నిమిషం మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్,ఉప ఎంపీపీలు సి.భాష,చెన్ను రాజశేఖర్,ప్రాజెక్ట్ డైరెక్టర్ చిత్తా రాజానంద రెడ్డి,కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయుడు జయరాములు ప్రసంగించారు.చివరగా ట్రెజరర్ చిత్తా ప్రజల్ రెడ్డి వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదిబోయిన మాలకొండయ్య, చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి,మానం ఆంజనేయులు,దూల రఘునాథరెడ్డి,పాల శ్రీనివాసులు రెడ్డి,కొండ పెద్ద సుబ్బారెడ్డి,విశ్రాంత ఉపాధ్యాయుడు పాలకొలను రమణారెడ్డి,తులసి సురేష్ మదర్ థెరెసా ఫౌండేషన్ వాలంటీర్లు,ఉద్యోగులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

Previous article
Next article
చీలాపూర్ లో ఉచిత వైద్య శిబిరం -250 మందికి ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ బెజ్జంకి, జూలై 6 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామంలో భాస్కరచారి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పలువురు ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకుని అవసరమైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత స్వర్గీయ భాస్కరచారి వర్ధంతి సందర్భంగా సురభి హాస్పిటల్, సిద్దిపేట వారి సహకారంతో ఉచిత
RELATED ARTICLES
- Advertisment -

Most Popular