మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 175 మంది అనాథ, అర్ధానాథ విద్యార్థులకు విద్యా సహాయం
పోరుమామిళ్ల జూలై 06 ప్రజావాణి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల్లో చదువుతున్న 175 మంది తల్లిదండ్రులు లేని మరియు తండ్రిని కోల్పోయిన విద్యార్థులకు మదర్ థెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.1,000 నగదుతో పాటు రూ.1,000 విలువైన విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి అధ్యక్షత వహించగా,ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చిత్తా కుటుంబం ఆధ్వర్యంలో మదర్ థెరెసా ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని...