ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
ఆచూకీ తెలియజేసిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడినని ప్రకటన
జైపూర్, జూలై 27,ప్రజావాణి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామంలో మహిళా వృద్ధురాలు మతిస్థిమితం లేక తప్పిపోయిన ఘటన వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం గంగిపల్లి లోని బంధువుల ఇంట్లో పెళ్లికి గత సంవత్సరం 2025 సెప్టెంబర్ 5వ తేదీన హాజరు అయిందని,మతిస్థిమితం కోల్పోయిన మహిళా వృద్ధురాలు ఎటో వెళ్ళిపోయిందని తెలిపారు.ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని,దీనిపై జైపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు.ముఖ్యంగా వృద్ధాశ్రమాలలో,అనాధ శరణాలయాల్లో,హాస్పిటల్లో,దేవాలయం, దర్గాల వద్ద ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మహిళా వృద్ధురాలు పేరు అమీనాభీ భర్త పేరు షేక్ మహ్మద్,వయసు 80 సంవత్సరాలు,చిరునామా గోదావరిఖని జనగామ ,రామగుండం మండలం,పెద్దపల్లి జిల్లా.వివరాలు తెలిసిన వారు 8688916946,9951952239,7981405930 నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలియజేయగలరని,వివరాలు తెలిపిన వ్యక్తులకు తగిన పారితోషికం ఇస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.



