📄 ePaper
Saturday, April 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలు చోట్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణముల ఏర్పాటు...

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలు చోట్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణముల ఏర్పాటు – స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహణ

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) మంగళగిరి తాడేపల్లి  జలధార–జలహారతి” కార్యక్రమంతో నీటి సంరక్షణ,పరిశుభ్రతపై అవగాహనకు నగర పాలక సంస్థ చర్యలు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పలు చోట్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణముల ఏర్పాటు–స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహణ నిడమర్రు చెరువు అభివృద్ధి, శుభ్రత కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ మంగళగిరి సాకారం“స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఆధ్వర్యంలో “జలధార–జలహారతి” పేరుతో శనివారం విస్తృత స్థాయిలో పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించబడియున్నవి. నీటి వనరుల సంరక్షణ,వర్షపు నీటి వినియోగం,పట్టణ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని కమీషనర్ తెలిపారు.ప్రస్తుతం భూగర్భ జలాల తగ్గుదల, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం,విద్యాసంస్థలు,ప్రజా భవనాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమం లో భాగంగా తొలుత మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, డాన్ బోస్కో పాఠశాల ప్రాంగణము,తాడేపల్లి తహశీల్దార్ వారి కార్యాలయం పరిసరాలలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణ పనులను ముఖ్య అతిధులుగా పాల్గొన్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి,గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గార్లతో కలిసి నగరపాలక సంస్థ కమీషనర్ అలీమ్ బాషా”స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర లో భాగమైన “జలధార – జలహారతి” నేపద్యంలో ప్రారంభించి స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించారు.అనంతరం నిడమర్రు చెరువు వద్ద జంగిల్ క్లియరెన్స్, చెరువు అభివృద్ది పనులను అడిషనల్ కమీషనర్ శకుంతల గారితో మరియు గ్రామస్తుల తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమీషనర్ అలీం బాషా మాట్లాడుతూ, “నీరు జీవానికి ప్రాణాధారం.ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం ప్రతి పౌరుడి బాధ్యత. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా నిల్వ చేసుకోవచ్చు. ఇది భవిష్యత్ తరాలకు గొప్ప సంపదగా నిలుస్తుంది” అని అన్నారు.అలాగే,“పట్టణ పరిశుభ్రత కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు,ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత అవసరం.చెరువులు,కాలువలు,వీధులు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలం.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలి”అని పిలుపునిచ్చారు.”మంగళగిరి తాడేపల్లి నగరాన్ని స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో కీలకం” అని తెలిపారు.స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ,“జలధార–జలహారతి వంటి కార్యక్రమాలు నీటి సంరక్షణను ప్రజల దైనందిన జీవితంలో భాగంగా మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు.“ప్రజల భాగస్వామ్యం,స్థానిక సంస్థల సమన్వయంతోనే స్వచ్ఛమైన,పర్యావరణహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుంది” అని ఈ కార్యక్రమాలు ఒకరోజుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో నగరవ్యాప్తంగా మరిన్ని ప్రదేశాల్లో అమలు చేయాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ప్రజల సహకారంతోనే స్వచ్ఛ మంగళగిరి సాధ్యమని”ఆమె తెలిపారు.ప్రజాప్రతినిధులు, అధికారులు,విద్యార్థులు,యువత,మహిళలు సహా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ కమీషనర్ శకుంతల,అసిస్టెంట్ కమీషనర్ పి.శ్రీనివాసరావు,సెక్రటరి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి,షేక్ రియాజ్,డాన్ బాస్కో విద్యార్ధులు మెప్మా సిబ్బంది,సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular