📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetభక్తిశ్రద్ధల మధ్య బేగంపేటలో హనుమాన్ శోభయాత్ర

భక్తిశ్రద్ధల మధ్య బేగంపేటలో హనుమాన్ శోభయాత్ర

📰 Generate e-Paper Clip

భక
బెజ్జంకి, మే 9 (ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హనుమాన్ మాలధారణ స్వాములు ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. గ్రామ వీధుల గుండా అంగరంగ వైభవంగా సాగిన ఈ శోభయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జై శ్రీరామ్ నినాదాలు, భజనలు, డప్పు వాయిద్యాలతో గ్రామం మొత్తం భక్తిమయ వాతావరణంలో మునిగిపోయింది. హనుమాన్ స్వామి చిత్రపటాలు, కాషాయ జెండాలతో ప్రత్యేక అలంకరణలు చేసి శోభాయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular