📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణWarangalబైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

చెన్నారావుపేట ఏప్రిల్ 11 ప్రజావాణి

మండల కేంద్రంలోని ఖాదర్ పేట టర్నింగ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపునగర్ మాజీ సర్పంచ్ బాదావత్ మేఘ్య అల్లుడు బానోత్ కిషోర్ పస్రా నుండి తన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై మండల కేంద్రం మీదుగా బాపునగర్ వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఖాదర్ పేట మలుపు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి సమీపంలో ఉన్న మోరీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ కింద పడిపోవడంతో అతని కాలు విరిగింది బలమైన గాయాలయ్యాయి.కిషోర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.దానితో పాటు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు  పేర్కొన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించి, క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular