📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బెజ్జంకి పీహెచ్‌సీని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్,ఎంపిడివో ప్రవీణ్

బెజ్జంకి పీహెచ్‌సీని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్,ఎంపిడివో ప్రవీణ్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) మంగళవారం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఎంపీఓ ఖలీల్ సందర్శించారు.ఈ సందర్భంగా జ్వర సంబంధిత కేసులు, సీజనల్ వ్యాధుల పరిస్థితి, ల్యాబ్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం బెజ్జంకి మండల వైద్యాధికారి డా. మాధురి, సూపర్‌వైజర్ సులోచన, ఏఎన్‌ఎంలు అనిత, సరోజతో పాటు ఆశా కార్యకర్తలతో సమావేశమై సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, గ్రామాల్లో జ్వరాల సర్వే, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సులు,ఏఎన్ ఎం లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular