అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: కాంగ్రెస్ నాయకులు
ఎల్కతుర్తి (ప్రజావాణి న్యూస్), జూలై 22:
ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాలేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్, నిరుద్యోగం వంటి అంశాలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పులపాలు చేసి, కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతితో ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం “దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది” అని ఎద్దేవా చేశారు.
అనంతరం పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం కూడా రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిరాశకు గురి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, వివిధ గ్రామాల కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ సర్పంచులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
RELATED ARTICLES



