📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaబిజెపి ప్రభుత్వాన్ని యువతనే గద్దె దింపుతుంది రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన ఆది శ్రీనివాస్

బిజెపి ప్రభుత్వాన్ని యువతనే గద్దె దింపుతుంది రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన ఆది శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

బీజేపీ ప్రభుత్వన్ని యువతనే గద్దె దింపుతుంది

రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేతలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్.

నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.

బీజేపీ వైఫల్యంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం.

సిరిసిల్ల గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన.

డీసీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం.

సిరిసిల్ల, ప్రజావాణి

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో ప్రధాని నివాసం ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, గ్రంధాలయం చైర్మన్ సత్యనారయణ గౌడ్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ విచ్చేశారు.అది శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ అసమర్థత కారణంగానే పేపర్ లీకేజీలు జరిగాయని, దీంతో లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని,ముక్కు నుండి రక్తం కారుతున్న పోలీసులు ఏడ్చుకుంటూ పోయారని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, యువతపై పోలీసులతో బలప్రయోగం చేయించడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.యువతపై లాఠీ ఛార్జ్ చేసిన బీజేపీ ప్రభుత్వన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయాని హేచ్చరించారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనను ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.వెంటనే కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధన్ ని తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular