📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బద్వేలు నియోజకవర్గం నుండి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ను కమిటీ సభ్యులు గా ఎన్నుకోబడ్డారు

బద్వేలు నియోజకవర్గం నుండి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ను కమిటీ సభ్యులు గా ఎన్నుకోబడ్డారు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మే 08) తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము మే 26-28 తేది లలో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ సంవత్సరము నెల్లూరు జిల్లాలో జరుగుతుంది.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ప్రతి విభాగంలో కమిటీ లను నారా చంద్రబాబు నాయుడు, లోకేష్,స్వయంగా పరిశీలించి ఏర్పాటు చేశారు.రక్తదానం,మెడికల్ క్యాంపు కమిటీ నందు బద్వేలు నియోజకవర్గం నుండి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ ను కమిటీ సభ్యులు గా నిన్న విడుదల చేసిన జాబితా లో నియమించడం జరిగింది. కడప జిల్లా నుండి కేవలం ఐదు మంది ని మాత్రమే తీసుకోవడం జరిగింది అందులో బద్వేలు నియోజకవర్గం నుండి డాక్టర్ రాజశేఖర్ మహానాడు కమిటీల్లో వున్నారు.గతంలో కూడా అనంతపురం లో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం నందు, కర్నూల్ లో జరిగిన ప్రధానమంత్రి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాం బహిరంగ సభకు కూడా డాక్టర్ రాజశేఖర్ పార్టీ ఆదేశానుసారం వైద్య సేవలు అందించారు.ఈ సందర్బంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ పార్టీ తన సేవలను వినియోగించు కుంటున్నందులకు హర్షం వ్యక్తం చేశారు,తన అదృష్టం గా భావిస్తున్నట్లు తెలియజేసారు.మహానాడు సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలియజేసారు. బద్వేలు నియోజకవర్గం నుండి కార్యకర్తలు,నాయకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎండ తీవ్రతకు తగిన జాగ్రత్త లు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular