📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarప్రైవేట్ విద్యాసంస్థలో పుస్తకాల విక్రయంపై విద్యార్థి సంఘం నాయకుల అభ్యంతరం

ప్రైవేట్ విద్యాసంస్థలో పుస్తకాల విక్రయంపై విద్యార్థి సంఘం నాయకుల అభ్యంతరం

📰 Generate e-Paper Clip

ప్రైవేట్ విద్యాసంస్థలో పుస్తకాల విక్రయంపై విద్యార్థి సంఘం నాయకుల అభ్యంతరం

* పుస్తకాలు నిల్వ ఉంచిన గదికి తాళం వేసిన మండల విద్యాధికారి

* భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు బీఆర్ఎస్వి కొమ్ము నరేష్

జమ్మికుంటజూన్ 20 (ప్రజావాణి)

జమ్మికుంట మండలం వావిలాల సెంటిమెరి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు నోట్‌బుక్స్‌ స్కూల్ యూనిఫామ్ ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల యాజమాన్యమే నేరుగా విక్రయిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు బీఆర్ఎస్వి కొమ్ము నరేష్ నల్లగాస హరీష్ చింతల కౌశిక్ ఆరోపించారు. సెంటిమెరి ఉన్నత పాఠశాల సమీపంలోని ఓ ఇంట్లో పాఠ్యపుస్తకాలను స్కూల్ యూనిఫామ్ నోట్ బుక్స్ ను నిలువ ఉంచారని తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం విద్యాశాఖఅధికారులకు సమాచారం అందించి  పాఠశాల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారుపాఠశాల నిర్వాహకులు ఒకసారి తామే విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలనునోట్ బుక్స్ ను తెప్పించామని చెప్పి మరోసారి మాట మార్చి తమకు సంబంధం లేదు. అవి ఏజెన్సీ వాళ్ళు తెప్పించుకొని విక్రయిస్తున్నారని పొంతన లేని సమాధానం చెప్పారని అన్నారువిషయాన్ని మండల విద్యాధికారి తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి తెలపగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు పాఠశాలకు చేరుకున్న మండల విద్యాధికారిని తమతో పాటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడి పలు వివరాలను సేకరించడం జరిగిందన్నారుమార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే పుస్తకాలనునోట్ బుక్స్ స్కూల్ యూనిఫామ్ ను విద్యాసంస్థలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారువిద్యాసంస్థలు విద్యా బోధనకే పరిమితం కావాలని పుస్తకాల విక్రయాలను వ్యాపారంగా మార్చడం సరికాదని అన్నారు. పాఠశాల నిర్వహకులే పుస్తకాలనునోట్ బుక్స్ యూనిఫామ్స్ ను విక్రయించడం వల్ల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారుపుస్తకాలు నిల్వ ఉంచిన గదికి తాళం వేసిన మండల విద్యాధికారినివిద్యార్థి సంఘం నాయకులు అందించిన సమాచారం మేరకు పాఠశాలకు చేరుకున్న మండల విద్యాధికారిని హేమలత పాఠశాల నిర్వాహకుల నుండి పలు వివరాలను సేకరించారు. పాఠశాల సమీపంలోని ఓ ఇంటి గదిలో పాఠ్యపుస్తకాలనునోట్ బుక్స్ ను నిలువ ఉంచిన విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారుఈ సందర్భంగా మండల విద్యాధికారిని హేమలత మాట్లాడుతూరెండు రోజులలో పుస్తకాల నిలువపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని అన్నారుపాఠశాల యాజమాన్యానికి ఇట్టి విషయంపై నోటీసు సైతం జారీ చేయునట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం, పుస్తకాలను విక్రయించే ఏజెన్సీ వారి నుండి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని అన్నారు అప్పటివరకు పుస్తకాలు, నోట్ బుక్స్ ను నిలువ ఉంచిన గదికి తాళం వేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular